schedule Saturday, August 22, 2026

లక్ష్మీ తండాలో విద్యుత్ షాక్ తో నాలుగు గేదెల మృతి

calendar_today May 16, 2025
person meenewstelugu
లక్ష్మీ తండాలో విద్యుత్ షాక్ తో నాలుగు గేదెల మృతి

లక్ష్మీ తండాలో విద్యుత్ షాక్ తో నాలుగు గేదెల మృతి

 మీ న్యూస్ ప్రతినిధి మే 16: సూర్యాపేట మండలం లక్ష్మితండాలో విద్యుత్ వైర్లు తెగిపడి నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తండా శివారు ప్రాంతం లో మేతకు వెళ్లిన గేదెలు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. గత నెల రోజులు పైగా విద్యుత్ తీగలు తెగి పొలం లో పడి ఉన్నాయని అనేక సార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయిందనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు..

విద్యుత్ తీగలు నేలపై పడిపోవడంతో లోనావత్ బుల్లి, లోనావత్ నీలా కు చెందిన నాలుగు గేదెలు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి.

ఈ ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రెండు లక్షల డెబ్భై వేలు పైగా ఉంటుందని కన్నీటి పర్వతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.