schedule Sunday, August 23, 2026

శ్రీవారిని దర్శించుకున్న విఠల్ నాయక్ దంపతులు.

calendar_today May 27, 2025
person meenewstelugu
శ్రీవారిని దర్శించుకున్న విఠల్ నాయక్ దంపతులు.

శ్రీవారిని దర్శించుకున్న విఠల్ నాయక్ దంపతులు

⏩:-ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు

⏩:-కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలం

తాండూరు మీ న్యూస్ ప్రతినిధి మే27:- తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వర్య్త విఠల్ నాయక్ దంపతులు దర్శించుకున్నారు .మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్య్త విఠల్ నాయక్, కోకట్ ఎల్ ,ఎఫ్ ,ఎల్ (ఎం ,పి ,పి ,ఎస్),ప్రభుత్వ పాఠశాలప్రధానో పాధ్యాయురాలు వర్య్త కిష్టమ్మ దంపతులు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని బ్రేక్ దర్శనంలో దర్శించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ తలపెట్టిన కార్యక్రమాల్లో విజయవంతంగా చేకూరాలని ఆశీర్వదిస్తూ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలం అన్నారు. శ్రీనివాసుని కరుణాకటాక్షాలు తాండూర్ నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.