schedule Sunday, August 23, 2026

ప్రజా సంక్షేమ పాలనలో కేసీఆర్ మించినోడు లేడు

calendar_today May 29, 2025
person meenewstelugu
ప్రజా సంక్షేమ పాలనలో కేసీఆర్ మించినోడు లేడు

ప్రజా సంక్షేమ పాలనలో కేసీఆర్ మించినోడు లేడు

 మీన్యూస్ ప్రతినిధి మే 28:-ప్రజా సంక్షేమ పాలనలో కేసీఆర్ మించినోడు మరి యొకరు లేరని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సి.ఏం.ఆర్.ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. తెలంగాణ ప్రథమ ముఖ్య మంత్రి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. అడినవే కాకుండా అవసరమున్న అనేక పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కెసిఆర్ ది అన్నారు. ఇప్పటికీ కేసీఆర్ పథకాలే తప్ప ప్రజల కు కొత్తగా ఒరిగింది ఏమి లేదు అన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక చేతులెత్తిందన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు,420 హామీలు ఏమైనవో తెలియదు అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద కెసిఆర్ ఇచ్చిన లక్ష తప్ప తులం బంగారం ఊసే లేదన్నారు. ఒక్కరిద్దరికే పరిమితమైన సీఎంఆర్ఎఫ్ ను అందరికీ చేరువ చేసింది కెసిఆర్ అన్నారు. రైతు భరోసా కాదు నేడు వ్యవసాయానికే భరాసా లేకుండా పోయిందన్నారు. నారుమల్లల మారిన కల్లాలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టు కుంటున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల్లో ఎలాంటి చలనం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులకు మోసపోయామని ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మాజీ జెడ్పిటిసి జిడిబిక్షం, మాజీ లింగమంతు ల స్వామి దేవాలయం చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్,అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.