schedule Saturday, August 22, 2026

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

calendar_today June 8, 2025
person meenewstelugu
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ....

 సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు...

 ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు....

 ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పలు రాజకీయ పక్షాల నాయకులు....

మీ న్యూస్ ప్రతినిధి :-త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ రషాది అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ పండుగ ప్రవక్త ఇబ్రహీం భక్తి భావాన్ని విశ్వాసాన్ని త్యాగ భవనాలను సమాజానికి ప్రబోధిస్తుందన్నారు. ఈ పండుగ రోజున అల్లాకు ఇష్టమైన ఆచారం ఖుర్బానీ ఇవ్వడం అన్నారు. పండుగలోని పరమార్థం జంతువులను బలివడమే కాదని హృదయంలోని స్వార్థం అహంకారం భౌతిక ఆసక్తులను త్యాగం చేసి అల్లాకు దగ్గరవడమే అన్నారు. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత త్యాగం చేసి పేదల ఆకలి తీర్చడం మానవత్వాన్ని వెలుగులోకి తేవడమే అన్నారు. సామూహిక ప్రార్ధన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సోదర భావాలు వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు బక్రీద్ సందర్భంగా పలు రాజకీయ పక్షాల నాయకులు ఈద్గాా  వద్ద ముస్లిం సోదరులకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.