schedule Saturday, August 22, 2026

సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సేలవు దినంగా ప్రకటించాలి.

calendar_today February 15, 2026
person meenewstelugu
సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సేలవు దినంగా ప్రకటించాలి.

సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సేలవు దినంగా ప్రకటించాలి.

 

సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.

 

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.

మీ న్యూస్ తాండూర్ టౌన్::::బంజారుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం బాలాజీ నర్సింగ్ హోం సమీపంలో ని సేవలాల్ మహారాజ్ విగ్రహనికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ తదితరులు కలిసి పూలమాలలు వెసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. సంతు సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని పేర్కొన్నారు.గిరి పుత్రులు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.ప్రతిరోజూ ఆద్యాత్మిక తతో ముందుకు సాగాలన్నారు.అనంతరం హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ,మాజీ కో ఆప్షన్ నెంబర్ వెంకట్ రామునాయక్, బషీర్ బషర్ మియతండా మాజీ సర్ పంచ్ మితృనాయక్ ,చరణ్ సింగ్ ,అనీల్ రాథోడ్ ,గోపాల్ ,రవి ,అనార్ సింగ్ ,శంకర్ ,దీపక్ రాథోడ్ ,ప్రకాష్ ,చందర్ ,విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.