schedule Saturday, June 13, 2026

ప్రజా పాలనలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న రేవంత్ సర్కార్

calendar_today March 3, 2026
person meenewstelugu

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 100 నియోజకవర్గాల్లో 200 పాఠశాలలు 

సమగ్ర విద్యా సంస్థలు: ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో

స్కూల్ బస్సు నెట్‌వర్క్ గ్రామాలు, బస్తీలను పాఠశాలలతో అనుసంధానం

ఇంటర్ విద్యా విధానం ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలపడం

ఫీజుల నియంత్రణ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు కమిషన్

ఉపాధ్యాయుల పనితీరు ఆటోమేటిక్ ప్రమోషన్లు రద్దు, పనితీరు ఆధారంగా ప్రమోషన్ 

కలాల్ చంద్రశేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు

 మీ న్యూస్ తాండూరు ప్రతినిధి ::: వచ్చే ఏడాది నుంచే తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది రేవంత్ సర్కార్. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అప్‌గ్రేడ్ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాఠశాలల్లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు పూర్తిస్థాయి విద్య అందుబాటులోకి రానుంది.

తెలంగాణ విద్యా కమిషన్ పాలసీ:::విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలోని బృందం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ పేరుతో రూపొందించిన సమగ్ర నివేదికను సమర్పించింది.

*కొత్త విద్యా విధానంలో ప్రధానాంశాలు:*

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: 100 నియోజకవర్గాల్లో 200 పాఠశాలలు

సమగ్ర విద్యా సంస్థలు: ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో

-స్కూల్ బస్సు నెట్‌వర్క్: గ్రామాలు, బస్తీలను పాఠశాలలతో అనుసంధానం

-ఇంటర్ విద్యా విధానం: ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలపడం

ఫీజుల నియంత్రణ: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు కమిషన్

- ఉపాధ్యాయుల పనితీరు: ఆటోమేటిక్ ప్రమోషన్లు రద్దు, పనితీరు ఆధారంగా ప్రమోషన్

2,000 పాఠశాలల ఆధునీకరణ:

రేవంతన్న ప్రజా పాలనలో రాష్ట్రంలోని 2,000 పాఠశాలలను ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో కూడిన సమగ్ర విద్యా సంస్థలుగా మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది. ప్రతి స్కూల్‌లో సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతులు ఉంటాయి.

స్కూల్ బస్సు నెట్‌వర్క్:::రేవంతన్న ప్రజా పాలనలో దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం అంకితమైన స్కూల్ బస్సు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గ్రామాలను, బస్తీలను పాఠశాలలతో అనుసంధానిస్తారు.

బడ్జెట్ కేటాయింపు:::రేవంతన్న ప్రజా పాలనలో ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి, రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే వీటికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

సమగ్ర సంస్కరణలు:::రేవంతన్న ప్రజా పాలనలో ప్రీ-స్కూల్ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు మొత్తం 12 అధ్యాయాలతో కూడిన ఈ నివేదికలో సాంకేతిక విద్య, ఓపెన్ లెర్నింగ్, పాలనాపరమైన సంస్కరణలపై కీలక సిఫార్సులు ఉన్నాయి.

ఈ పాలసీ తయారీ కోసం విద్యా కమిషన్ గత 14 నెలలుగా కమిషన్ తీవ్రంగా శ్రమించింది . ప్రజా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 305 విద్యా సంస్థలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి విద్యా కమిషన్ నివేదికను రెడీ చేసింది.

పంజాబ్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల్లోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును అధ్యయనం చేసి .తల్లిదండ్రుల సంఘాలు, టీచర్ యూనియన్లు, విద్యావేత్తలు, గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్‌తో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ నివేదికను సిద్ధం చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజా పాలనలో విద్య వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తుందని తెలిపారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలు:::నాణ్యమైన విద్యను తెలంగాణ బిడ్డలకు అందించడమే లక్ష్యంగా, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ప్రజా పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాన్ని ప్రజా పాలనలో రేవంతన్న సర్కార్ అమలు చేయబోతుందని తెలంగాణలో నడుస్తుంది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని తెలిపారు.

ఈ నిర్ణయం తెలంగాణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో తొడ్పాటును అందిస్తుందని విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో మాత్రమే శ్రీకారం చుట్టడం జరిగిందని నాటి నుంచి నేటి వరకు అది ఏ రంగంలో అయినా నూతన విప్లవ్వాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.