schedule Saturday, August 22, 2026

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

calendar_today March 21, 2026
person meenewstelugu
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జి:::మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ లోని పల్లె ప్రకృతి వనం దగ్గర గత గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూడు కృష్ణ. గుండారపు దుర్గయ్య. మండవ రాముడు. వీరబోయిన వెంకన్న. వీరబోయిన శ్రీను. కారింగుల కమలాకర్. కారింగుల వెంకన్న.కారింగుల కిరణ్. కారింగుల లింగయ్య. బత్తిని విజయలక్ష్మి. కారింగుల సరిత. వెంకటమ్మ .రేణుక. మౌనిక. సునీత. పాపమ్మ. ఝాన్సీ. పజ్జురి లక్ష్మమ్మ. గుండారపు అనసూయ.తదితరులు పాల్గొన్నారు