schedule Saturday, August 22, 2026

ఆరుగురు కూలీల కాపాడిన  పోలీసులు 

calendar_today September 2, 2024
person meenewstelugu
ఆరుగురు కూలీల కాపాడిన  పోలీసులు 

ఆరుగురు కూలీల కాపాడిన  పోలీసులు 

జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్..

----వాటర్ లో చిక్కుకున్న 6 గురు కూలీలు 

---మత్యుకార్మికుల సహాయంతో సురక్షితంగా

----పోలీసు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు  

మీ::(ప్రతినిధి కోల రవీందర్ గౌడ్)

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగుడెం గ్రామ శివారు పాలేరు బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న గుడివాడకు చెంది 6 గురు కూలీలు ముగ్గురు ఆడవారు, ఒక చిన్నాపాప, ఇద్దరు మగవాళ్ళను పోలీసు, కోదాడ మత్యుకార్మికుల సహాయంతో సురక్షితంగా రక్షించారు. కూలీలు పని చేస్తున్న కోళ్ల ఫామ్ షేడ్ లోకి పాలేరు బ్యాక్ వాటర్ రావడంతో ప్రమాదంలో చిక్కుకుని పోలీసు వారి సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణభయంతో వనికి ప్రాణాలతో బయటపడ్డ కూలీలు పోలీసు వారికి, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపినారు. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగినది.