schedule Saturday, June 13, 2026

భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలవాలి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.

calendar_today September 4, 2024
person meenewstelugu

భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలవాలి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.

  తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్  
తాండూరు.మీ: న్యూస్ ప్రతినిధి. భక్తి శ్రద్ధతో భగవంతుని కొలవాలని తాండూరు మండల టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ పేర్కొన్నారు.మంగళవారం శ్రావణ మాసం సమాప్తి సందర్భంగా మల్కాపూర్ గ్రామంలో వీరాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని వెల్లడించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.